Sunday, January 19, 2025

భార్య, ముగ్గురు పిల్లలను చంపి… భర్త మణికట్టు కోసుకొని…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆర్థిక సమస్యలతో భార్య, ఇద్దరు పిల్లలు, నాలుగు నెలల పసికందును చంపేసి అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజేష్ అనే వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలు, నాలుగు నెలల పసికందును చంపేశాడు. అనంతరం మణికట్టు ప్రాంతం కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. స్నేహితుడు రాజేష్ సోదరుడికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి రాజేష్ ను ఆస్పత్రికి తరలించారు. రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రాజేష్ తల్లిదండ్రులు పక్క రూమ్‌లో ఉన్నప్పటికి వృద్ధాప్యం దృష్ట్య వారు బయటకు రాలేకపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News