Tuesday, January 7, 2025

మాజీ ఆర్మీ అధికారి, భార్య, కుమార్తెను కత్తులతో పొడిచి చంపారు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వివాహ వార్షికోత్సవం రోజున మాజీ ఆర్మీ అధికారి, భార్య, కూతురును హత్య చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నెబ్‌సరాయి ప్రాంతంలో రాజేశ్(55)- కోమల్(47) అనే దంపతులు తన కూతురు కవిత(23), కుమారుడు అర్జున్ తో కలిసి ఉంటున్నారు. రాజేశ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. డిసెంబర్ 4న రాజేశ్- కోమల్ దంపతుల వివాహ వార్షికోత్సవం ఉండడంతో తల్లిదండ్రులకు ఘనంగా చేయాలని కూతురు, కుమారుడు అనుకున్నాడు.

బుధవారం తెల్లవారుజామున కుమారుడు వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాజేశ్, కోమల్, కవితపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారు. కుమారుడు ఇంటికి వచ్చేసిరికి ముగ్గురు రక్తపు మడుగులో కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవం జరుపుకుందామనేలోపు ఈ దారుణం జరిగిందని కుమారుడు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News