Monday, December 23, 2024

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: నామా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మోడీ ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపి నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు.
పార్లమెంటు ఆవరణంలో బిఆర్‌స్ ఎంపిలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహం దగ్గర బిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన చేపట్టారు. సేవ్ మణిపూర్, విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని అంటూ బిఆర్‌ఎస్ ఎంపిలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామా మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని నామా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే సుప్రీం అని తెలిపారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ఫెడరలిజాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు కె కేశవ రావు, సంతోష్ కుమార్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర పాల్గొన్నారు.

Also Read:  తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు: హరీష్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News