న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓ వైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023’ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి సంబంధించి ఏ చట్టాన్నయినా రూపొందించే అధికారాన్ని రాజ్యాంగం లోక్‌సభకు కలించిందన్నారు.అంతేకాకుండా చట్టాన్ని తీసుకువచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు సైతం గతంలో స్పష్టం చేసిందని చెప్పారు.
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఢిల్లీ ప్రభుత్వం బిల్లును అడ్డుకునేందుకు యత్నిస్తోందని,ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిసూంత విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి బిలు ్లప్రతులను చించివేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు సుశీల్ కుమార్ రింకూ సైతం తనకు మాట్లాడడానికి అవకాశమివ్వలేదని ఆరోపిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని ప్రతిసభ్యుడికీ మాట్లాడేందుకు అవకాశమిస్తామని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు.
దీనిపై విపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ బిల్లును తీసుకు రావడాన్ని రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.‘ఢిల్లీ సర్వీసెస్ బిలు’ ్లఅప్రజాస్వామికమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభసభ్యుడు సికె వేణుగోపాల్ విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని , సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అన్నారు. దేశంలో సమాఖ్య విధానంపై దాడి ఆమోదయోగ్యం కాదని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) ఎంపి మనోజ్ ఝా మండిపడ్డారు.
ఇవాళ ఢిల్లీపై దాడి జరుగుతోందని, రేసు మరే రాష్టరంపైనైనా జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలోని పరిపాలన, సేవలపై నియంత్రణు లెఫ్టెనెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చినప్పటినుంచి ఢిల్లీ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలను కూడగట్టే యత్నం చేశారు. కాంగ్రెస్ సహా అన్ని వివిధ ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆయనకు మద్దతు పలికారు. ఇప్పుడు బిల్లు లోక్‌సభకు చేరిన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
రాజ్యసభలో సర్కార్‌కు బిజెడి మద్దతు
మరో వైపు ఢిల్లీ సర్వీసుల బిల్లుకు బిజూ జనతా దళ్ మద్దతు ప్రకటించడంతో ఈ విషయంలో పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలినట్లయింది. బిల్లుకు మద్దతు తెలియజేయడంతో పాటుగా రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేని అధికార పక్షానికి కొండంత అండ లభించినట్లయింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రభుత్వానికి మద్దతు తెలియజేసిన ఏ కూటమికి చెందని రెండో విపక్ష పార్టీ బిజెడి కావడం గమనార్హం.
బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని రాజ్యసభలో బిజెడి పార్టీ నేత సస్మిత్ పాత్ర మంగళవారం తెలియజేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగానే బిజెడికి రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన 18 మంది సభ్యుల మద్దతు లభించడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 238మంది ఉన్నారు.
అధికార ఎన్‌డిఎకు 100 మందికి పైగా ఎంపీలుండగా, నామినేటెడ్ సభ్యులు, కొందరు స్వతంత్ర సభ్యులతో పాటుగా ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు కలిపితే ఆ కూటమికి మెజారిటీకన్నా ఎక్కువ బలం లభిస్తుంది. మరో వైపు 26 పార్టీలతో కూటమికి చెందిన సభ్యులతో పాటుగా బిఆర్‌ఎస్, కపిల్ సిబల్ లాంటి కొంతమంది స్వతంత్ర సభ్యులతో కలుపుకొని మొత్తం 109 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయవచ్చని భావిస్తున్నట్లు ప్రతిపక్షాలకు చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు.