- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఇంతకు ముందు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్‌లో ఉన్నాయని కోర్గు పేర్కొంది. అందుకే దీన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. మే 19 న కేంద్ర ప్రభుత్వం జీఎన్‌సిటీడీ ఆర్డినెన్సును జారీ చేసింది. ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Also Read: ‘రూల్స్ రంజన్’ నుంచి శృంగార గీతం
- Advertisement -