Thursday, January 23, 2025

ఢిల్లీ నడిబొడ్డున నేడు కవిత దీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. సాంకేతిక కారణాలతో పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు పోలీసులు గురువారం మధ్యాహ్నం కవితకు సమాచారం అందించగా జాగృతి సంస్థ ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరిపారు. పలు పరిమాణాల అనంతరం పోలీసులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో జంతర్‌మంతర్ వద్ద చ ట్ట సభల్లో మహిళల్లకు 33% రిజర్వేషన్ బిల్లును పార్ల మెంట్‌లో వెంటనే ఆమోదింపంచేయాలన్న డిమాండ్ తో శుక్రవారం కవిత తలపెట్టిన దీక్ష యధావిధిగా జరుగనుం ది.

అంతకుముందు దీక్షకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పో లీసులు తెలపడంతో కవిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష నిర్వహించుకునేందుకు ముందుగా అనుమతిచ్చి తర్వాత ఎలా నిరాకరిస్తారని మండిపడ్డారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు ఉండదని, ఎట్టి పరిస్థితుల్లో నూ దీక్ష నిర్వహించి తీరుతామని కవిత స్పష్టం చేశారు. దీంతో పోలీసులు దిగివచ్చి కవిత దీక్షకు అనుమతి ఇచ్చారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష
2014, 2019 ఎన్నికల సమయంలో బిజెపి తమ మేనిఫెస్టోల్లో రెండు సార్లు హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని కవిత ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానించామని అందరూ సహకరించాలని కవిత కోరారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీలో ఈ దీక్షను తలపెట్టగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసిన భారత్ జాగృతి ప్రతినిధులు దాదాపు 6 వేల మంది దీక్షలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీతారాం ఏచూరిని దీక్షకు ఆహ్వానించా
సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని నేటి దీక్షకు రావాలని ఆహ్వానించానని కవిత తెలిపారు. సీతా రాం ఏచూరికి ఈ కార్యక్రమ వివరాలు తెలియచేశానని ఆమె పేర్కొన్నారు. మహిళా బిల్లు ఆవశ్యకతపై సీతారాంతో చర్చించానని ఆమె తెలిపారు. నేటి దీక్షకు 18 పార్టీల నుం చి సంఘీభావం రావడం శుభ పరిణామమని తెలిపారు.
ఢిల్లీకి బయలుదేరిన మంత్రులు
మరోవైపు నేటి దీక్షలో పాల్గొనేందుకు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాధోడ్ సహా బిఆర్‌ఎస్ మహిళా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేబినెట్ జరుగుతుండగానే మంత్రులు మధ్యలోనే ఢిల్లీకి పయనమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News