Monday, December 23, 2024

మెట్రోరైలులో బాలికపై వికృత చేష్టలు… నిందితుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోరైలులో బుధవారం తల్లితో కలిసి రైలులో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడాడు. ఇది గమనించిన ఆ తల్లి తన కుమార్తెతోసహా కిందకు దిగిపోయింది. తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకుని ఢిల్లీ మెట్రో అధికారులకు అప్పగించారు. బుధవారం ఢిల్లీ మెట్రో రైలు రెడ్‌లైన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రక్షాబంధన్ కావడంతో బుధవారం సాయంత్రం మెట్రోరైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి.

ఆ సమయంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌లైన్‌లో ప్రయాణిస్తున్న రైలులో ఓ ప్రయాణికుడు… ఆ తోపులాటలో పక్కనే ఉన్న బాలికను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమై సీలంపూర్ స్టేషన్‌లో దిగిపోయింది. అయితే పక్కనున్న ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని షాహ్‌దరా స్టేషన్‌లో మెట్రో అధికారులకు అప్పగించారు. ఆపై స్టేషన్ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీస్‌లకు అప్పగించారు. నిందితుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన వాడు. పనికోసం ఢిల్లీ వచ్చినట్టు పోలీస్‌లు నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News