Monday, December 23, 2024

పోలీసులు నన్ను, నా భర్తను అరెస్టు చేశారు: గీతా ఫోగట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనను, తన భర్త పవన్ సరోహాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు రెజ్లర్ గీతా ఫోగట్ తెలిపారు. అయితే వారిద్దరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని, అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ ఫోగట్, పలువురు మల్లయోధులతో(రెజ్లర్‌లతో) కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ‘నన్ను, నా భర్త పవన్ సరోహాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇది చాలా బాధాకరం’ అని ఆమె ట్వీట్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారని గీతా ఫోగట్ పేర్కొన్న కొద్ది గంటలకే అరెస్టు జరిగింది.

 

‘ఢిల్లీ పోలీసులది ఏకపక్ష చర్య. జంతర్ మంతర్ వద్ద నా తోబుట్టువుల వద్దకు వెళ్లకుండా నన్ను కూడా ఆపారు. ఇంటికి వెళ్లండి లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అనే రెండు మార్గాలే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇది అత్యంత ఖండనీయం’ అని ఆమె ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News