Monday, December 23, 2024

సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వండి: మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా తమను వేధించారంటూ మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీస్‌లు ఆరోపణలకు బలం చేకూర్చే ఫోటో, ఆడియో, వీడియో సాక్షాలు ఉంటే ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరారు. బ్రిజ్ భూషణ్ తమను 2016 నుంచి 2019 మధ్య లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇద్దరు మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 21న ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ పోలీస్ సేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రిజ్ భూషణ్ శ్వాసను పరీక్షించే నెపంతో 10 నుంచి 15 నిమిషాల సేపు ఆయన తమ ఛాతీపై చేతులు వేసేవాడని, అక్కడి నుంచి చేతులు కిందకు జారుస్తూ పొట్టపై నొక్కేవాడని, ఆ సమయంలో తాను ఛాతీకి అడ్డంగా తన చేతిని పెట్టుకున్నానని రెజ్లర్లలో ఒకరు ఆరోపించారు.

ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఇద్దరు మహిళా రెజ్లర్లకు సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం జూన్ 5న వేర్వేరు నోటీస్‌లు జారీ చేశారు. ఆరోపణలను రుజువు చేసే సాక్షాధారాలు సమర్పించడానికి ఒక రోజు గడువు ఇచ్చారు. ఈ నోటీస్‌లు అందుకున్న ఇద్దరిలో ఒక రెజ్లర్ మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్షాధారాలను సమర్పించామని చెప్పినట్టు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడిన తేదీలు, సమయాలు, అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు, సాక్షుల వివరాలను సమర్పించాలని ఢిల్లీ పోలీస్‌లు కోరారు.

డబ్లుఎఫ్ఐ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లారు? రూమ్‌మేట్స్ వివరాలు, సంఘటనలు జరిగిన సమయాల సాక్షాలు కావాలని కోరారు. అయితే ముఖ్యంగా విదేశాల్లో ఎప్పుడు ఉన్నారు ?ఒక రెజ్లర్ బస చేసిన హోటల్ వివరాలు అడిగారు. ప్రభుత్వానికి రెజ్లర్లకు మధ్య జూన్ 7న ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ తరువాత కొంచెం మార్పు వచ్చింది. జూన్ 15 వరకు ఆందోళన కొనసాగిస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరు గంటల పాటు రెజ్లర్లతో చర్చించి జూన్ 15 నాటికి కేసులో ఛార్జిషీటు దాఖలు చేయడమౌతుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News