న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటికి చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలపై గతం లోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ఆయన నుంచి స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఆదివారం రాహుల్ ఇంటికి చేరుకున్నారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్ లేన్‌లో ఉన్న రాహుల్ నివాసానికి చేరుకుంది.
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయనను సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్టు పేర్కొన్నారు. తద్వారా వారికి మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో మహిళల లైంగిక దాడుల్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనని కొంతమంది మహిళలు కలిశారని, ఇప్పటికీ తాము లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో అలా రాహుల్‌ను ఆశ్రయించిన వారి జాబితాను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు.
'भारत जोड़ो यात्रा' और राहुल गांधी जी ने महिलाओं को अपनी समस्याएं व दर्द साझा करने का एक सुरक्षित मंच दिया।
दिल्ली पुलिस का यह शर्मनाक कदम साबित करता है कि अडानी मामले पर हमारे सवालों से PM मोदी घबराए हुए हैं।
ऐसी हरकतों से हमारा हौसला और मजबूत हुआ है, हम जवाब लेकर रहेंगे। https://t.co/GlOVemReC3
— Congress (@INCIndia) March 19, 2023