Monday, January 20, 2025

విమానంలో అరాచక నేపాలీ పండిట్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానంలో నేపాల్‌కు చెందిన మహేష్ సింగ్ పండిట్ బుధవారం అరాచక రీతిలో వ్యవహరించాడు. విమాన సిబ్బందిని బూతులు తిడుతూ చివరికి లావెటరీ తలుపులు విరిగొట్టాడు. టోరంటో నుంచి విమానం బయలుదేరిన దశలో ఈ పండిట్ బరితెగించి ప్రవర్తించాడు. ముందు తన 26ఇ సీటు నుంచి 26 ఎఫ్ సీటుకు మారాడు. అక్కడ కూర్చున్న తరువాత ఎకనామీ క్లాసు సిబ్బందిని తిడుతూ వచ్చారు.

చాలా సేపు సహించిన సిబ్బంది ఆ తరువాత పైలట్‌కు విషయం తెలిపారు. తరువాత బుద్ధిగా ఉండాలని ఈ ప్రయాణికిడికి చెప్పారు. మధ్యలో లంచ్ తరువాత విమానంలో పొగ హెచ్చరికల సౌండ్ వెలువడింది. దీనితో సిబ్బంది వెళ్లి లావెటరీ డోర్ తెరవగా లోపల ఉన్న ఈ ప్రయాణికుడి వద్ద లైటర్ ఉండటం, సిగరెట్టు వాసన రావడంతో పట్టుకున్నారు. తప్పించుకుని తన సీటు వద్దకు వెళ్లిన ఈ ప్రయాణికుడు కొద్ది సేపటికి పరుగెత్తుకుంటూ వెళ్లి వాష్‌రూం డోర్ పగులగొట్టాడు.

దీనితో సిబ్బంది కొందరు ప్రయాణికుల సాయంతో ఈ వ్యక్తిని పట్టుకున్నా వారిని కూడా కొట్టడానికి యత్నించాడు. చివరికి విమానం ఢిల్లీకి రాగానే ఈ విమాన కేబిన్ సూపర్‌వైజర్ ఆదిత్యాకుమార్ ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు బుక్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News