Monday, December 23, 2024

కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు… 10 మందిఅరెస్ట్

- Advertisement -
- Advertisement -

Delhi Police Bust Kidney Racket Gang

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. నగరం లోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ముఠా లోని 10 మందిని అరెస్టు చేశారు. హౌజ్ ఖాన్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన కేసు నమోదైంది. అరెస్టు అయిన పదిమందిలో ఒక డాక్టరు, పలువురు టెక్నీషియన్లు, హెల్పర్లు ఉన్నారు. సోనిపట్‌లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసిన అక్కడే పేషెంట్లకు మూత్ర పిండాల ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ఆపరేషన్ కోసం పేషెంట్ నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేసేవాడినని పట్టుబడిన వైద్యుడు విచారణలో వెల్లడించారు. ఆరు నెలల్లో సుమారు 14 మందికి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పాడు. విచారణలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News