Thursday, December 26, 2024

రూ.1500 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల ముప్పు నుంచి బాధితులను కాపాడడానికి చేపట్టిన ‘నశా ముక్త భారత్ అభియాస్’ అనే ప్రచారోద్యమంలో భాగంగా పట్టుబడిన 1,513.05 కోట్ల విలువైన 2800 కిలోల మాదక ద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. ఢిల్లీ ఎన్‌సిఆర్ నుంచి డ్రగ్స్ ముప్పును అరికట్టడానికి నశా ముక్త భారత్ ఉద్యమం కింద డ్రగ్స్ రవాణాదారులపై గట్టి చర్యలు తీసుకోవడమైందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీ నిలోథిలో దగ్ధవాటిక వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఆధ్వర్యంలో డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News