Wednesday, January 22, 2025

మునావర్ షోకు ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Delhi Police denied permission to Munawar show

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖి ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. మునావర్ ఫరూఖి షోకు అనుమతి ఇవ్వరాదని కోరుతూ విశ్వ హిందూ పరిషద్ నగర పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మునావర్ షో వల్ల ఆ ప్రాంతంలో మతసామరస్యానికి విఘాతం ఏర్పడుతుందని లైసెన్సు మంజూరు చేసే విభాగానికి పంపిన నివేదికలో సెంట్రల్ జిల్లా పోలీసులు తెలియచేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు శనివారం తెఇపారు. ఆదివారం(ఆగస్టు 28) మధ్యాహ్నం సెంట్రల్ ఢ్లిలీలోని ఎస్‌పిఎం సివిక్ సెంటర్‌కు చెందిన సి బ్లాక్‌లోని కేదర్‌నాథ్ సాహ్ని ఆడిటోరియంలో మునావర్ ఫరూఖి ప్రదర్శన జరగవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News