- Advertisement -
న్యూఢిల్లీ : భారత కుస్తీ సమాఖ్య (డబ్లుఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతూనే ఉందని ఢిల్లీ పోలీసు అధికారులు బుధవారం స్పష్టం చేశారు. బిజెపి ఎంపి అయిన బ్రిజ్‌పై మహిళా రెజ్లర్లు పలు లైంగిక వేధింపుల ఆరోపణలకు దిగడం, దీనితో దేశ రాజధాని వేదికగా నిరసనలు సాగడం తెలిసిందే.
ఈ దశలో సింగ్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన సాక్షాధారాలు లేవని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు నిరాధారమని, వీటిని నమ్మవద్దని బ్రిజ్ భూషణ్‌పై తమ దర్యాప్తు వేగవంతం అయిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అంశంపై పలు మీడియా ఛానల్స్ అనేక వార్తలు వెలువరిస్తున్నాయని, ఇవి నిరాధారం అని తెలిపిన అధికారులు తమ దర్యాప్తు పూర్తికాగానే సంబంధిత న్యాయస్థానానికి పంపించడం జరుగుతుందన్నారు.
- Advertisement -