Sunday, January 19, 2025

బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలు విచారించదగినవే…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ , మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా రెజ్లర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీస్‌లు దర్యాప్తు చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నమోదైన ఆరు కేసుల్లో ఆయన వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటివరకు 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్ తయారు చేశామని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించడానికి తగిన సాక్షాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఒక మైనర్‌తోసహా ఏడుగురు రైజర్లు, తమను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫోగట్, సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వంటి ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం రోజున ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా, పోలీసులు వారిని కస్టడీ లోకి తీసుకున్నారు. తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన తర్వాత వారు తమ నిరసనను విరమించారు. జూన్ 15 లోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని ఠాకూర్ వారికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News