ఢిల్లీ: మహిళా కానిస్టేబుల్‌ను హెడ్ కానిస్టేబుల్ హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని మురికి కాలువలో పడేసిన రెండు సంవత్సరాల తరువాత నిందితుడిని అరెస్టు సంఘటన ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మోనా అనే కానిస్టేబుల్, సురేంద్ర అనే హెడ్ కానిస్టేబుల్ ఒకే పోలీస్ స్టేషన్‌లో పిసిఆర్‌లో పని చేశారు. దీంతో ఇద్దరు మధ్య పరిచయం ఉండడంతో స్నేహంగా మారింది. పలుమార్లు మోనా తన కుటుంబ సభ్యులతో సురేంద్రను ఆమె పరిచయం చేసింది. సురేంద్ర ఇదే అదునుగా భావించి పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేయడంతో మోనా తిరస్కరించింది. దీంతో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి రాళ్లతో కప్పేశాడు.
మోనా సోదరి, సురేంద్రతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ఆమె కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. సురేంద్ర సోదరుడు రోవిన్‌తో మోనా కుటుంబానికి ఫోన్ చేయించేవాడు. మోనాకు వాయిస్ కాల్ రికార్డు చేసి ఆమె కుటుంబ సభ్యులకు పంపించేవాడు. దీంతో మోనా బతికే ఉందని కుటుంబ సభ్యులను నమ్మించిడంతో పాటు కేసును పక్కదారి పట్టించాడు. వివిధ రాష్ట్రాల నుంచి రోవిన్‌తో ఉన్నట్టుగా పోన్ కాల్స్ రావడంతో ఆమె బతికే ఉన్నట్టుగా నమ్మించేవారు. వివిధ రాష్ట్రాల నుంచి కాల్స్ ఉండడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మోనా సోదరి సమాచారం ఇచ్చింది. పోలీసులు కాల్స్ హిస్టరీ తీసుకొని రోవిన్, రాజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.