Monday, December 23, 2024

మెట్రోలో హస్తప్రయోగం: నిందితుడి ఫోటో విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

 

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తూ హస్తప్రయోగానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీని గుర్తించడంలో సహాయపడవలసిందిగా ప్రజలకు ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మెట్రోలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ఈ వ్యక్తిని గుర్తిస్తే ఆ వివరాలు పోలీసు కంట్రోల్ రూముకు తెలియచేయాలంటూ ఢిల్లీ పోలీసులకు ట్విటర్ వేదికగా అఢధికారికంగా ట్వీట్ చేశారు. వివరాలు అందచేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ఢిల్లీ పోలీసులకు తోడ్పడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడి ఫోటోను కూడా పోలీసులు ట్విటర్‌లో షేర్ చేశారు.

Also Read: ప్రేమ పెళ్లిళ్లలో పెటాకులే ఎక్కువ!

ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి హస్తప్రయోగానికి పాల్పడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వైరల్ అయింది. ఈ సంఘటనతో మెట్రోలో ప్రయాణించే ఆడపిల్లలు, మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వీడియోపై వెంటనే స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నోటీసులు జారీచేసి తక్షణమే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దరిమిలా ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌లో ఒక కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని నిందితుడి ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News