Thursday, January 23, 2025

బ్రిజ్ భూషణ్‌పై మైనర్ రెజ్లర్ ఆరోపణలకు ఆధారాల్లేవు: ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని ఢిల్లీ పోలీసులు గురువారం కోరారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ రెజ్లర్ చేసిన ఆరోఫణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు.

కాగా..తాను ఉద్దేశపూర్వకంగానే బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆ మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చిన విషయం తెలిసిందే. కాగా..ఇటీవల తనను కలుసుకున్న రెజ్లర్లకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కొన్ని హామీలు ఇవ్వగా వాటిలో చార్జిషీట్ దాఖలు ఒకటి. అదే విధంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఎన్నికలు జులై 6న నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News