Sunday, January 19, 2025

ఢిల్లీలో రూ. 2వేల కోట్ల కొకైన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మొట్టమొదటిసారి అత్యంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ. 2,000 కోట్ల విలువైన 560 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని మొహ్రౌలిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. ఢఙల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో కొకైన్‌ను అమ్మేందుకు నిందితులు పథకం వేశారని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం అందిన సమాచారంపై ప్రత్యేక విభాగం నిఘా వేసి సమయం కోసం వేచి ఉందని వారు చెప్పారు. పండుగల మాసం ముందు ఈ నలురు వ్యక్తులు కొకైన్‌తోసహా చిక్కారని వారు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి లభించే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News