Saturday, March 29, 2025

ఢిల్లీ హెచ్‌సి జడ్జి వర్మ ఇంటికి పోలీస్ బృందం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం తరువాత నోట్ల కట్టలు కనిపించాయన్న ఆరోపణ సందర్భంగా పోలీస్ డిప్యూటీ కమిషనర్ (న్యూఢిల్లీ) (డిసిపి) నేతృత్వంలో ఒక బృందం బుధవారం ఆయన నివాసాన్ని సందర్శించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలీస్ బృందం మధ్యాహ్నం సుమారు 1.50కి వర్మ ఇంటికి వెళ్లి రెందు గంటల తరువాత నిష్క్రమించింది. అయితే, వర్మ ఇంటి నుంచి వెళ్లిపోతున్నప్పుడు పోలీస్ బృందం మీడియాతో మాట్లాడకుండా తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది.

అగ్నిప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని బృందం సందర్శిస్తుందని, అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించవచ్చునని అంతకుముందు పోలీస్ వర్గాలు సూచించాయి. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టల ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు నిమిత్తం సిజెఐ ఈ నెల 22న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, ఆసంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ దర్యాప్తు నివేదికను అప్‌లోడ్ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అయితే, జస్టిస్ వర్మ ఆ ఆరోపణలను ఖండించారు. తాను గాని, తన కుటుంబ సభ్యులు గాని స్టోర్‌రూమ్‌లో ఎన్నడూ ఎటువంటి నగదు కట్టలూ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News