Monday, January 20, 2025

పోలీస్‌నని బెదిరించి… యువతిపై అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బాయ్ ఫ్రెండ్‌తో యువతి ఉన్నప్పుడు పోటోలు, వీడియోలు తీసి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేసి తాను పోలీసునని చెప్పి బెదిరించిన సంఘటన ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జులై 7న ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో షికారు చేస్తుంది. అదే సమయంలో రవి సోలంకి అనే వ్యక్తి ఇద్దరు కారులో ఉన్నప్పుడు ఫోటో, వీడియో తీశాడు. బాయ్ ఫ్రెండ్ ఆమెను ఆపార్ట్‌మెంట్ వద్ద వదిలేశాడు. అదే సమయంలో వారిని అనుసరిస్తూ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు.

Also Read: ఇంజక్షన్ వేసుకొని వైద్యుడు ఆత్మహత్య

మెట్లపై నుంచి నడుచుకుంటు వెళ్తుండగా ఆమెను రవి అడ్డగించాడు. తాను పోలీస్ అధికారిని అని చెప్పి వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. మెట్లపై ఆమెపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆమె వెంటనే తన బాయ్‌ఫ్రెండ్ కాల్ చేయడంతో ఏం జరిగిందని అడిగారు. అక్కడి నుంచి రవి పారిపోయాడు. ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో ఫోటో తయారు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News