Wednesday, January 22, 2025

రెజ్లర్ నిఖిల్‌కు నజరానా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన ప్రపంచ అండర్17 రెజ్లింగ్ పోటీల్లో పతకం సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిన తెలంగాణ యువ రెజ్లర్ నిఖిల్ యాదవ్‌కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేసింది. ఈ మేరకు స్కూల్ చైర్మన్ మల్కా కొమురయ్య, మల్కా యశసిలు దీనికి సంబంధించిన చెక్‌ను నిఖిల్‌కు అంద జేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Delhi Public School announces rs 1 lakh to Wrestler Nikhil

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News