Wednesday, January 22, 2025

ఢిల్లీలో 4.4డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉష్ణోగ్రత బుధవారం అత్యల్పస్థాయి 4.4డిగ్రీలకి పడిపోయింది. మరోరెండురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో వాతావారణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పస్థాయిగా అధికారులు పేర్కొన్నారు. ఈక్రమంలో ధర్మశాల, నైనిటాల్, డెహ్రాడూన్ కంటే దేశ రాజధాని ఢిల్లీ శీతలప్రాంతంగా మారింది. పొగమంచు దట్టంగా మారిపోవడంంతో విజిబిలిటీ స్థాయి 200 మీటర్లకు తగ్గిపోయింది.

దీంతో రవాణా నెమ్మదించింది. రహదారులపై వాహనాలతోపాటు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పొగమంచు కారణంగా రైళ్లు గంటన్నర నుంచి నాలుగున్నర గంటలు ఆలస్యమైనట్లు రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. భారత వాతావరణశాఖ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. కాగా ధర్మశాలలో 5.2 డిగ్రీలు, నైనిటాల్‌లో 6డిగ్రీల సెల్సియస్ ఉండగా డెహ్రాడూన్‌లో 4.5డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. వీటికంటే అత్యల్పంగా ఢిల్లీలో టెంపరేచర్ 4.4డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News