- Advertisement -
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. 11 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 42.6 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో మంగళవారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది గత 11 ఏళ్లలో ఏప్రిల్‌లో అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 2010 లో ఏప్రిల్‌లో ఒక రోజులో ఆల్‌టైమ్ అత్యధిక ఉష్ణోగ్రత 46.5 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదైంది. ఢిల్లీ లోని ఎనిమిది స్టేషన్లలో వేడిగాలులు వీచాయని తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 19 మంగళవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని, ఇది సీజన్‌లో అత్యంత వెచ్చని రోజుగా మారిందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
- Advertisement -