Sunday, December 22, 2024

ఎర్రకోట బంద్

- Advertisement -
- Advertisement -

సందర్శకులకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట పముదాయానికి సందర్శకులకు తాత్కాలికంగా అనుమతిని నిలిపివేశారు. డిమాండ్ల సాధనకు భారీ ఎత్తున రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భద్రతా కారణాలతో రెడ్‌ఫోర్టు ఆవరణలోకి ప్రవేశాలను నిలిపివేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఇప్పటికే భారీ స్థాయిలో పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మొఘల్‌ల కాలం నాటి ఈ చారిత్రక కట్టడం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అవార్డు పొందిన స్థలాన్ని సోమవారం అర్థరాత్రి నుంచి ఆకస్మికంగా సందర్శకుల రాకకు వీల్లేకుండా మూసివేసినట్లు మంగళవారం ఉదయం స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు పురాతత్వ శాఖ అధికారులు తెలిపారు. ఎప్పుడు తిరిగి ఎర్రకోట వద్దకు అనుమతి ఉంటుందనేది భద్రతా సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెప్పారు. ఎర్రకోట సందర్శనకు సాధారణంగా సగటున రోజువారిగా ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మంది వరకూ సందర్శకులు వస్తుంటారు. గతంలో రెడ్‌ఫోర్టు వద్ద రైతుల ఆందోళన దశలోనే పలు రకాలుగా తీవ్రస్థాయి అవాంఛనీయ ఘటనలు నిరసనల పేరిట జరిగాయి. దీనితో తిరిగి ఇటువంటివి జరగకుండా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని దిగ్బంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News