- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ కరోనా కలవరం పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 79,491 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20,960 మందికి వైరస్ సోకింది. మరో 311 మంది మరణించారు. అదే సమయంలో 19,209 మంది కోలుకున్నారు. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1,253,902 కు, మరణాల సంఖ్య 18,063 కు చేరుకుంది. పాజిటివిటీ రేటు 26.37 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 91,859 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో మే 10 వరకు లాక్ డౌన్ అమలులో ఉంది. అవసరమైన కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంది. ఆహార పదార్థాలు, కిరాణా సామాగ్రి, మందులు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల కదలిక, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ప్రభుత్వ సిబ్బంది, న్యాయ అధికారులు, జర్నలిస్టులు, వైద్య సంరక్షణ కోరుకునే వారి అమ్మకాలు, సరఫరా అనుమతిచ్చారు.
Delhi reports 20960 new COVID-19 cases
- Advertisement -