న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 63,610 మందికి కరోనా పరీక్షలు చేయగా, 231 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.36 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. తాజాగా 876 కరోనా రోగులు కోలుకోగా, మరో 36 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో ప్రస్తుతం 5,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 13,99,640 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 24,627 మంది కరోనా బారినపడి మృతిచెందినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
Delhi reports 231 fresh COVID cases (positivity rate – 0.36%), 876 patient recoveries, and 36 deaths in the last 24 hours.
Active cases: 5,208
Total discharges: 13,99,640
Death toll: 24,627 pic.twitter.com/nNzuEoVCt0— ANI (@ANI) June 7, 2021