న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా మరో 648 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో కనీసం 86 మంది మరణించినట్లు తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. ఢిల్లీలో కరోనా నుంచి మరో 1,622 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 14,26,240కి పెరిగింది. దేశ రాజధానిలో ప్రస్తుతం 11,040 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రెండున్నర నెలల్లో అతి తక్కువ కేసులు ఇవే కావడం గమనార్హం. కరోనా పాజిటివిటీ రేటు 0.99శాతంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఢిల్లీలో లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఆరు వారాల లాక్డౌన్ అమలు చేసిన తరువాత ఢిల్లీలో దశల వారీ అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కేసులు మళ్లీ పెరగడం ప్రారంభిస్తే అన్‌లాక్ ప్రక్రియ ఆగిపోతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు కరోనా వైరస్ నుండి తప్పించుకుంటారు… కానీ ఆకలితో చనిపోతారు అని కేజ్రీవాల్ హెచ్చరించారు.
Delhi reports 648 new #COVID19 cases (positivity rate 0.99%), 1622 recoveries, and 86 deaths in the last 24 hours
Case tally 14,26,240
Active cases 11,040 pic.twitter.com/k9oLxOnZTU— ANI (@ANI) May 31, 2021