Monday, December 23, 2024

ఢిల్లీలో అక్కాచెల్లెళ్లను తుపాకీతో కాల్చి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: డబ్బుల విషయంలో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని ఆర్‌కె పురం ప్రాంతం అంబేడ్కర్ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మేఖేల్, దేవ్, అర్జున్ అనే వ్యక్తులతో పింకీ(30), జ్యోతి(29) కుటుంబ సభ్యులతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ముగ్గురు వ్యక్తులు పింకీ, జ్యోతి భర్తలను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీళ్లు తుపాకీతో ఇద్దరు మహిళపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఎస్‌జె ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీలో పౌరులకు రక్షణ లేదని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ స్వాధీనం చేసుకుందామని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ ఆప్ చేతిలో ఉంటే ఢిల్లీ సురక్షితంగా ఉండేదన్నారు. మృతుల పట్ల సిఎం కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. వాళ్ల ఆత్మకు శాంతి చేకూరలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News