Monday, December 23, 2024

సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారించిన కోర్టు.. కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లు వెల్లడించింది. ఈ బెయిల్ పిటిషన్ పై మే 2న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది.

కాగా, ఏప్రిల్ 11న కవితను తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేసిన సిబిఐ.. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీ తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. తొమ్మిది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News