Sunday, January 19, 2025

నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. ఇడి ఛార్జ్‌షీట్‌పై విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు ఇడి అధికారులు. ఇటీవల ఆమెపై ఇడి దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై కూడా విచారణ జరపనుంది కోర్టు.

మరోవైపు, ఇడి కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. కాగా, సిబిఐ, ఇడి కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత వేసిన పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News