Tuesday, November 5, 2024

ఢిల్లీలో పాఠశాలలు వారంపాటు మూసివేత

- Advertisement -
- Advertisement -

Delhi Schools Closed For One Week Due To Air Pollution

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలల్ని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తన ఆదేశాలు సోమవారం నుంచి అమలవుతాయని తెలిపారు. అయితే,ఆన్‌లైన్ తరగతులకు అనుమతిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, తమ ప్రభుత్వం తరఫున దానిపై ఓ ప్రతిపాదనను కోర్టు ముందుంచుతామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని 100 శాతం వర్క్ ఫ్రం హోంకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు ఇదే సూచన చేస్తున్నామన్నారు. అన్ని నిర్మాణ పనులను ఈ నెల 14 నుంచి 17 వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News