Monday, January 20, 2025

పలుమార్లు అత్యాచారం…. రేపిస్ట్‌ను చంపేసిన మహిళ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పలుమార్లు అత్యాచారం చేయడంతో రేపిస్ట్‌ను మహిళ మరో వ్యక్తితో కలిసి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2023 జనవరిలో ఓ మహిళకు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. మహిళ ఒంటరిగా ఉండడంతో ఆమెపై దూరపు బంధువు అబుజార్ అనే వ్యక్తి కన్నేశాడు. ఆమెపై అబుజార్ పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడి నుంచి విముక్తి కావాలని కోరుకుంది. సదరు మహిళ అబుజార్ చంపాలని నిర్ణయం తీసుకొని ఇర్ఫాన్ అనే వ్యక్తి భార్యను కలిసింది.

Also Read: పాతబస్తీలో ఐదు స్టేషన్లు

తన భర్త సహాయం చేస్తాడని సదరు మహిళకు హామీ ఇచ్చింది. బేటా ఫామ్‌కు అబుజార్‌ను రమ్మని సదరు మహిళ కబురు పంపడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. ఇర్ఫాన్‌తో కలిసి సదరు మహిళ అబుజార్‌ను చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న 20 సిసి కెమెరాలను పరిశీలించగా ఇద్దరు అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News