Thursday, January 23, 2025

ఐపిఎల్ వేలం…. ఢిల్లీ జట్టుకు నెల్లూరు కుర్రోడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నెల్లూరు సిటీకి చెందిన రంజీ క్రికెట్ ప్లేయర్ అశ్విన్ హెబ్బార్ ను ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ క్రికెట్ ప్లేయర్స్ కొనుగోలులో ఢిల్లీ టీమ్ కొనుగోలు చేసింది. 1995లో జన్మించిన అశ్విన్ నెల్లూరు నుండి పలు క్రికెట్ టోర్నమెంట్ లలో ఆడుతూ రంజీ మ్యాచ్ లలో సత్తా చాటారు.

అండర్ 16 ఆంధ్ర ప్రదేశ్ టీమ్ లీడర్ గా కూడా వ్యవహరించిన అనుభవంతో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్ లలో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. ఐపిఎల్ లో క్రికెట్ క్రీడాకారులు అమ్మకంలో మొట్ట మొదటి సారిగా తన పేరును నమోదు చేసుకున్న వెంటనే ఢిల్లీ టీమ్ అశ్విన్ హెబ్బార్ ను 20 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. రంజీ ప్లేయర్ గా అవకాశమే గొప్పగా భావిస్తున్నా ఈ తరుణంలో మన నెల్లూరు కుర్రోడు అశ్విన్ హెబ్బార్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐపిఎల్ వేలం పాటలో కొనుగోలు చేయడంతో జిల్లాకే గర్వకారణమని క్రికెట్ అభిమానులు అశ్విన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News