Saturday, December 21, 2024

డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: డ్రగ్స్‌కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కుమారుడు కొట్టి చంపిన సంఘటన ఢిల్లీలోని సుభాష్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురేష్ కుమార్ అనే వ్యక్తి కుటుంబం కలిసి ఢిల్లీలోని షాకూర్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. గత కొన్ని రోజుల సురేష్ కుమారుడు అజయ్, తండ్రి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో తండ్రిని కుమారుడు డబ్బులు అడిగాడు. తండ్రి డబ్బులు లేవని చెప్పడంతో వెంటనే పదునైన ఆయుధంతో తండ్రిపై దాడి చేశాడు. తండ్రి చెవి భాగంతో బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News