Wednesday, January 22, 2025

ఊపిరాడని ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి వాహనాల విషయంలో సరి, బేసి విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీపావళి పండుగ తర్వాత రోజునుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వాయుకాలుష్యంపై చర్చించేందుకు మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. తొలివిడతగా 20వ తేదీ వరకూ సరి, బేసి విధానం అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

అడ్డుకున్న అధికారితోనే వ్యర్థాలకు నిప్పు…
పంజాబ్‌లో కూడా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాలోని మొహమా సర్జా గ్రామంలో కొందరు రైతులు తమ పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండగా హర్‌ప్రీత్ సింగ్ అనే అధికారి అడ్డుకున్నాడు. దాంతో రైతులు అధికారిపై తిరగబడ్డారు. రైతు సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకుని సదరు అధికారి చేతిని కొయ్యకాలుకు నిప్పుపెట్టించారు. పంట వ్యర్థాలను కాల్చివేయవద్దని అడ్డుకునేందుకు వచ్చిన అధికారితోనే రైతులు బలవంతంగా పంట వ్యర్థాలను తగులబెట్టించడంపై సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను పంజాబ్ సిఎం భగవంత్ మాన్ ఎక్స్‌లో షేర్ చేశారు. కాగా, ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News