Thursday, January 23, 2025

ఢిల్లీలో యువతి హత్య.. పెళ్లికి నిరాకరణతో అమానుషం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని పాతికేళ్ల యువతిని స్థానిక పార్క్‌లో హతమార్చాడు. సమీపబంధువు అయిన నర్గీస్ మృతదేహం దక్షిణ ఢిల్లీలోని మాలవియా నగర్‌లో ఉన్న అరబిందో కాలేజీ వద్ద పార్క్‌లో పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. పక్కన నెత్తుటి మరకలతో ఇనుపరాడ్ పడి ఉంది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు.

ఈ క్రమంలో ఇర్ఫాన్ అనే చిరుద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు కనుగొన్నారు. తనకు సరైన ఉద్యోగం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు పెళ్లికి నిరాకరించారని, తొలుత తనను ఇష్టపడ్డ యువతి దూరం కావడం ఇష్టం లేక తాను పార్క్‌లో ఆమెను ఇనుప కడ్డీతో కొట్టి చంపివేసినట్లు పోలీసులకు లొంగిపోయిన తరువాత పోలీసులకు తెలిపారు. హత్యకు గురైన యువతి కమలా నెహ్రూ కాలేజీలో డిగ్రీ చేశారు. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ కోర్సు చేస్తోంది. ఎట్లాగూ తనకు ఆమె దక్కదని నిర్థారించుకుని మూడురోజులుగా తాను ఆమెను చంపేందుకు తగు అవకాశం కోసం చూస్తూ వచ్చానని అమానుషపు ఇర్ఫాన్ తెలిపాడు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News