Friday, December 20, 2024

ప్రాక్టీకల్ ఎగ్జామ్స్… పంతుల్ని పొడిచిన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: గవర్నమెంట్ స్కూల్‌లో ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా పంతులును ఓ విద్యార్థి కత్తితో పొడిచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన భుదేవ్(29) అనే టీచర్ తన భార్య, కూతురుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణీగా ఉంది. ఇందూరిపూరి ప్రాంతంలో భూదేవ్ ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ నిమిత్తం అతడు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ విద్యార్థి యూనిఫామ్‌గా సరిగా ధరించుకోకపోవడంతో గతంలో అతడిని పలుమార్లు తిట్టాడు. గురువారం కూడా ప్రాక్టీకల్ ఎగ్జామ్ జరుగుతుండగా విద్యార్థి యూనిఫామ్ నీట్‌గా ఉండకపోవడంతో మందలించాడు. ప్రాక్టీకల్ ఎగ్జామ్ సందర్భంగా స్కూల్లో రౌండ్స్ వేస్తున్నప్పుడు సదరు విద్యార్థికి టీచర్ ఎదురుగా వచ్చాడు. అప్పుడు కూడా టీచర్ విద్యార్థిని మందలించడంతో కత్తి తీసి టీచర్ కడుపులో పొడిచాడు. వెంటనే టీచర్‌ను బిఎల్‌కె కపూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఐపిసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News