Thursday, January 23, 2025

పంత్ జెర్సీ నంబర్‌తో ఐపిఎల్ బరిలో ఢిల్లీ జట్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డుప్రమాదంతో ఐపిఎల్ తాజా సీజన్‌కు దూరమవడంతో అతడి జెర్సీ నంబర్‌తో ఢిల్లీ జట్టు ఐపిఎల్ 2023బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని డిసి హెడ్‌కోచ్ పాంటింగ్ ధ్రువీకరించాడు. పంత్ జెర్సీ నంబర్‌ను జట్టు జెర్సీ లేదా క్యాప్‌లపై ముద్రించనున్నట్లు తెలిపాడు. పంత్ జట్టులో లేకపోయిన జట్టుతోనే ఉన్నాడని తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. కాగా గత డిసెంబర్ 30న ఢిల్లీ సమీపంలోని రూరీ ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో పంత్ గాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News