Friday, January 24, 2025

ప్రియురాలును కత్తితో పొడిచి చంపిన బాయ్ ఫ్రెండ్

- Advertisement -
- Advertisement -

Delhi Teen stabbed to death by ex-boyfriend

 

ఢిల్లీ: బాయ్ ఫ్రెండ్ తన ప్రియురాలును కత్తితో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖాన్ అనే వ్యక్తి ఆటో మెకానిక్‌గా పని చేసేవాడు. గత సంవత్సరం నుంచి అతడు ఏం పని చేయకుండ తిరుగుతున్నాడు. బీనా ఝా(19)కు ఖాన్ మధ్య పరిచయం ఉంది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకొనేవారు. ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కలుద్దామని ఝాకు ఖాన్ సూచించాడు. భుల్‌భులైయా ప్రాంతంలో ఖాన్‌ను ఝా కలుసుకోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను వెనక నుంచి బిగ్గరగా పట్టుకొని కత్తితో మెడపై పలుమార్లు పొడిచాడు. ఆమె అతడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ వీలుపడలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని డిసిపి బెనితా మారీ జైకర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News