Tuesday, December 24, 2024

ఢిల్లీలో ఇక 450 వైద్య పరీక్షలు ఉచితం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  జనవరి1 నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య కేంద్రాల్లో 450 రకాల వైద్య పరీక్షలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉచితంగా అందించబోతున్నది. ఇది ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేయించుకోలేని వారికి ఉపయోగకరంగా ఉంటుందిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 212 వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తోందని అధికారులు తెలిపారు. మొహల్లా క్లినిక్కులలో మరి 238 వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదం తెలిపారని వారన్నారు.
ఎలాంటి ఆర్థిక హోదా అన్న తేడాలేకుండా అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు, విద్య అందివ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్షం అని కేజ్రీవాల్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News