Monday, December 23, 2024

ఢిల్లీ యూనివర్సిటీ అల్మనీకి తెలంగాణ డిజిపికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 8న హాజరు కావాలని పిలుపు
పిఎం పర్యటన వల్ల హాజరుకాలేనని ఆడియో సందేశం
పంపిన డిజిపి అంజనీకుమార్

 

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఢిల్లీ యూనివర్సిటీలోని కిరోరి మల్ కాలేజ్ వార్షిక అల్మనీకి తెలంగాణ డిజిపి అంజనీకుమార్‌ను ఆహ్వానించారు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దినేష్ కట్టర్. ఈ నెల నిర్వహించే అల్మనీలో పాల్గొనాలని పూర్వ విద్యార్థయిన డిజిపి అంజనీకుమార్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి కిరోరిమల్ కాలేజీ చదువుకున్నారు. అక్కడ చదువుకునే సమయంలోనే 1990లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. కాగా హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఉన్నందున హాజరు కాలేనని డిజిపి అంజనీకుమార్ ఆడియో సందేశం పంపించారు. తాను కిరోరీ కాలేజీలో సీనియర్లు, ప్రొఫెసర్ల నుంచా చాలా నేర్చుకున్నానని, వారు తనకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని డిజిపి అంజనీకుమార్ తెలిపారు. తనకు విద్యాబుద్దలు నేర్పిన ప్రతి ఒక్క గురువును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాట్నా నుంచి వచ్చిన 20 రోజుల తర్వాత తనకు హాస్టల్ సీట్ కేటాయించారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News