- Advertisement -
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు సముదాయంలో లభించినట్లు చెబుతున్న శివలింగంపై మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు శుక్రవారం అరెస్టు అయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్ లాల్‌కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయనను కోర్టులో హాజరుపరచగా రూ. 50,000 వ్యక్తగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రతన్ లాల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జ్ఞానవాపి మసీదులో లభించిన శివలింగంపై ప్రజల మతవిశ్వాసాలను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా రతన్ లాల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారని న్యాయవాది వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -