Monday, December 23, 2024

ఢిల్లీ వర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్థానిక ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో మొత్తం నాలుగు ప్రధాన పదవులలో ఎబివిపికి మూడు దక్కాయి. ఒక్క స్థానం ఎన్‌ఎస్‌యుఐ కైవసం చేసుకుంది. శనివారం సాయంత్రం కౌంటింగ్ పూర్తయింది, విద్యార్థి సంఘం ప్యానెల్ ఎన్నికలలో బిజెపి అనుబంధ ఎబివిపికి చెందిన తుషార్ దేధా విద్యార్థి సంఘం అధ్యక్షులు అయ్యారు. కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐకు చెందిన హితేష్ గులియాను ఓడించారు. కాగా ఎబివిపి చెందిన అపరాజిత కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ అయ్యారు. కాగా ఎన్‌ఎస్‌యుఐ అభ్యర్థి అభి దహియా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News