Monday, December 23, 2024

ఢిల్లీ జల మండలి ఆఫీస్‌లో విధ్వంసకాండ

- Advertisement -
- Advertisement -

మండే ఎండల నేపథ్యంలో ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొంత మంది వ్యక్తులు ఛత్తర్‌పూర్‌లోని ఢిల్లీ జల మండలి (డిజెబి) కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. వారు కుండలతో కిటికీ అద్దాలు పగులగొట్టారు. ఈ సంఘటన బిజెపి, ఆప్ నేతల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఢిల్లీ మంత్రి సౌరభ్ భారద్వాజ్ ఈ విధ్వంసకాండ వీడియోను ‘ఎక్స్’లో పంచుకుంటూ, విధ్వంస కాండకు బిజెపి నేతలు ప్రేరేపించారని ఆరోపించారు. బిజెపి నేత రమేష్ బిధూరి దీనిపై స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకు

అది ప్రయత్నిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ‘వారు అవినీతి ఆరోపణల నుంచి తమను రక్షించుకోవడానికి కథనం మారుస్తున్నారు. ఢిల్లీ జల మండలిలో ఆడిట్ అనేదే లేదు. మండలి రూ. 70 వేల కోట్ల నష్టంలో ఉన్నది. ఇది అవినీతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాం’ అని బిధూరి చెప్పారు. ఆస్తులకు నష్టం కలిగించవద్దని ప్రజలకు బిధూరి విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా, ద్వారక జిల్లాలో ఒక ఉమ్మడి పంపు వద్ద నీటిని పట్టుకోవడంపై ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఉభయ పక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో రెండు కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News