న్యూఢిల్లీ: ఢిల్లీలో త్రాగు నీటి సంక్షోభంపై బిజెపి, ఆప్ ప్రభుత్వాన్ని నిందించింది. ‘మిస్ మేనేజ్మెంట్’ అని విమర్శించింది. నీటి ఎద్దడి పై చర్చించేందుకు ప్రత్యేక సెషన్ ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ ను శనివారం డిమాండ్ చేసింది.
బిజెపి చీఫ్ విప్ అజయ్ మహావర్ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ కు లేఖ రాశారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడమే కాక, నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీటి పంపిణీ నిర్వహణలో ఆప్ ప్రభుత్వం చేతకాకుండా ఉందని నిందించార. ప్రస్తుత సంక్షోభానికి ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ప్రభుత్వం కారణమన్నారు.
నీటి సమస్యపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ బిజెపి యూనిట్ చీఫ్ విరేంద్ర సచ్ దేవ స్పీకర్ ను డిమాండ్ చేశారు. అయితే ఢిల్లీ జల మంత్రి ఆతిసి నీటి ఎద్దడిపై యమున నీళ్లు వదలడం లేదంటూ హర్యానా ప్రభుత్వాన్ని నిందిస్తోంది.