Thursday, January 23, 2025

శివసేన ఢిల్లీ విభాగం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే నేతృత్వం లోని శివసేన ఆదివారం ఢిల్లీ విభాగాన్ని ప్రారంభించింది. దేశ రాజధానిలో “మహారాష్ట్ర మోడల్‌” అభివృద్ధిని అమలు చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా శివసేన సీనియర్ నేతలు ఆనందరావు అడ్సూల్, అంశుమన్ జోషి అనేక మంది నాయకులను పార్టీ లోకి చేర్చుకున్నారు. ‘భూమి పుత్రులు’ అన్నహక్కు కోసం, రాజధానిలో అవినీతిని పెకలించడానికి పాటుపడతామని వారు ప్రకటించారు. షిండే త్వరలో ఢిల్లీ వచ్చి ఢిల్లీ విభాగం కార్యవర్గాన్ని ప్రకటిస్తారని అంశుమన్ జోషి ప్రకటించారు. మంచి పాలనే అజెండాగా స్థానిక ప్రజలందర్నీ కలుసుకుంటామని, మంచిపాలన, మహారాష్ట్రమోడల్, అప్నా అభిమాన్ , ధనుష్‌బాణ్ తదితర నినాదాలతో ప్రచారం సాగిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News