Monday, December 23, 2024

ఒన్ ప్లస్ ఒన్ మీల్స్ ఆఫర్: రూ. 90 వేలు మోసపోయిన మహిళ

- Advertisement -
- Advertisement -

ఇండోర్: ఒక భోజనం ఆర్డర్ ఇస్తే మరో భోజనం ఫ్రీ అంటూ వచ్చిన ఆఫర్‌కు ఆశపడిన ఒక 40 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 90,000 పోగొట్టుకుంది. ఒక బ్యాంకులో సీనియర్ ఎగ్టిక్యూటివ్ గా పనిచేస్తున్న సవితా శర్మ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఈ ఒన్ ప్లస్ ఒన్ భోజనం ఆఫర్ గురించి తన బంధువు ఒకరు తెలియచేసినట్లు సవితా శర్మ పోలీసులకు తెలిపారు. ఈ ఆఫర్ గురంచి తెసుకునేందుకు ఫేస్‌బుక్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు సవిత ఫోన్ చేశారు. కాగా.. ఆమె ఫోన్‌ను ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. కాని కొద్ది సేపటి తర్వాత ఆ ఫోన్ నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ సాగర్ రత్న ఇస్తున్నీ ఈ ఒన్ ప్లస్ ఒన్ ప్లస్ మీల్స్ ఆఫర్ గురించి ఫోన్ చేఇసిన వ్యక్తి ఆమెకు వివరించాడు.

ఆమెకు ఒక లింక్ షేర్ చేసిన కాలర్ ఆఫర్‌ను పొందాలంటే ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందని చెప్పాడు. యాప్ యాక్సెస్ కోసం యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను కూడా అతను పంపాడు. యాప్‌లో మొందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాతే ఆఫర్ పొందవచ్చని ఆమెకు కాలర్ చెప్పాడు. అతడు చెప్పిన ప్రకారమే సవిత మొదుగా అతడు పంపిన లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశారు. ఆ మరుక్షణమే ఆమె ఫోన్ హ్యాక్ అయింది. ఆమె ఖాతా నుంచి రూ. 40,000 బెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కొద్ది క్షణాల తర్వాత మరో రూ. 50,000 డెబిట్ అయినట్లు ఇంకో మెసేజ్ వచ్చింది.

తన క్రెడిట్ కార్డు నుంచి డబ్బు తన పేటిఎం అకౌంట్‌లోకి వెళ్లి అక్కడి నుంచి నేరగాడి అకౌంట్‌లోకి మళ్లడం తనను షాక్‌కు గురించేసిందని మే 2వ తేదీన సైబర్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో సవిత పేర్కొన్నారు. కాలర్‌కు తాను ఎటువంటి వివరాలు అందచేయలేదని, వెంటనే తాను తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించానని ఆమె తెలిపారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా..ఒన్ ప్లస్ ఒన్ మీల్స్ ఆఫర్ గురించి తమకు కస్టమర్ల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అండదదినట్లు సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News