Thursday, January 23, 2025

మళ్లీ డేంజర్ మార్క్ దాటిన యమునా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురి చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా, బుధవారం ఉదయానికి నీటి మట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునమ్మ ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు.

కేంద్ర జలకమిషన్ సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లుగా నమోదవ్వడంతో ఢిల్లీ లోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్, హిమాచల్‌లో మళ్లీ కుంభవృష్టి
ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News